1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. AVS

Kothimooka | AVS | Rosaiah | Audio | ఏవీఎస్ - సీఎం రోశయ్య "నీది తెనాలి.. నాది తెనాలి"

కోతిమూక
WD
దళారీ వ్యవస్థ అంటే ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగర్‌ను ప్రశ్నించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తాజ్ డెక్కన్‌లో కోతిమూక ఆడియో వేడుక జరిగింది. ఏవీఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా మురళీమోహన్ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉందనీ, నిర్మాతకు పైరసీ పెనుభూతంగా మారిందనీ చెప్పారు. దీనికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే సాగర్ మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ వల్ల చిత్ర పరిశ్రమ ఇంటెన్సివ్ కేర్‌లో ఉందనీ, అందుకే వాటిని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఆ తర్వాత రోశయ్య స్పందిస్తూ.. అసలు ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పైరసీ నివారణకు చట్టపరంగా చర్యలు తీసుకుని అరికడతామన్నారు. అయితే దళారీ వ్యవస్థ అనేది ఏమిటో తనకు తెలియదని దాని గురించి తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను 20 ఏళ్ల నుంచి సినిమాలు చూడటం లేదనీ, అయితే కోతిమూక చిత్రాన్ని మాత్రం చూడాలనుకుంటున్నానని చెప్పారు.

ఇదిలావుంటే... తెలుగుదేశానికి నమ్మినబంటు అయిన ఏవీఎస్ చంద్రబాబు నాయుడుని పిలువకుండా రాష్ట్రముఖ్యమంత్రి రోశయ్యను పిలవడం చర్చనీయాంశమైంది. "నీది తెనాలి... నాది తెనాలి"లాగా ఇద్దరూ గుంటూరు జిల్లా వారు కావడంతో నిర్మాత జగదీష్ కుడా అదే ప్రాంతానికి చెందినవారు కావడంతో రోశయ్యను పిలవాల్సివచ్చి ఉంటుందని కొందరు అనుకోవడం కనిపించింది. అయితే భవిష్యత్‌లో ఏవీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాడేమోనని పలువురు చర్చించుకోవడమూ వినిపించింది. రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ ఎప్పుడు ఏదైనా జరుగవచ్చని మరికొందరు అనుకోవడం విశేషం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT