Simha | Actor Balakrishna | Boyapati Sreenu | Success meet | నా మీసం నుంచే "సింహా" కథ పుట్టింది: బాలకృష్ణ
WD
ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని పాటలు హిట్ చేశాడు చక్రి" అంటూ బాలయ్య అభినందించారు. అయితే ఈసారి తన ఉపన్యాసంలో ఆచితూచి స్పందిస్తూ... ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడటం విశేషం. హీరోయిన్ల గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతూ... "హొయలు ఒలకబోసే నయనతారను దర్శకుడు తెలుగమ్మాయిలా చూడగానే నమస్కరించేట్లుగా తీర్చి దిద్దాడు. ఇక నమిత.. అలాగే స్నేహా ఉల్లాల్ పాత్రలు కూడా బాగానే ఉన్నాయి. సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా సరిపోయారు" అని పేర్కొన్నారు.
సింహా గత రికార్డులను భూస్థాపితం చేసి కొత్త రికార్డులను సృష్టించిందని చెపుతూ... మధ్యలో ఆగి... నా చిత్రాల రికార్డుల గురించే చెపుతున్నా. మిగతావారి రికార్డుల గురించి కాదు అని అన్నారు. అవసరమైన టైమ్‌లో ఇండస్ట్రీకి మంచి సక్సెస్ వచ్చిందన్నారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో సక్సెస్ అయ్యాను. అభిమానులు, ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ చేతులు జోడించారు.
"కథలు హీరోను బట్టే పుడతాయి. హీరో ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి. క్లైమాక్స్ అలా ఉండాలి అని రాస్తారు. కానీ సింహా కథను దర్శకుడు బోయపాటి శ్రీను నా మీసం, గడ్డం గెటప్ చూశాక... కథ రాసుకున్నాడు. గ్లామర్‌గా ఉన్నప్పుడే డీగ్లామర్ పాత్రలు వేయాలి. అలా నాన్నగారు వేశారు. బోయపాటి శ్రీను గురించి చెప్పాలంటే.. రెండేళ్లనాడు నా దగ్గరికి వచ్చాడు. కానీ కథలు నచ్చలేదు. అలా తిరుగుతూనే ఉన్నాడు.
ఒకసారి పరుచూరి కృష్ణప్రసాద్‌గారు వచ్చి కథ వినమని బోయపాటి శ్రీనును వెంట తీసుకుని వచ్చారు. కథ విన్నాక.. ఇన్నాళ్లు ఆగింది.. దైవం ఇటువంటి సక్సెస్ కోసమే ఆపాడు అనిపించింది. నన్ను నూతనంగా చూపించే ఆయన ధోరణి, ఆయనలో క్లారిటీ నచ్చి వెంటనే సినిమా చేద్దామని చెప్పాను. ఈ సందర్భంగా నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు" అని చెప్పారు.
సినిమా సక్సెస్ ముందే తెలిసిపోతుంది
సినిమా సక్సెస్ ముందుగానే తెలిసిపోతుంది. ఒకప్పుడు వంశానికొక్కడు సినిమా టైటిల్‌లో ఇద్దరు తల్లుల మధ్య జరిగే సంభాషణలు డబ్బింగ్ చెపుతుంటే విన్నాను. అది విని సక్సెస్ అవుతుందనే తెలిసిపోయింది. సింహాలో కూడా కోట శ్రీనివాసరావు డబ్బింగ్ చూశాక.. ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని తెలిసింది. మరో వైబ్రేషన్.. చక్రి సంగీతం... ఇలా ముందుగానే తెలిసిపోతుంటాయి అన్నారు.
పోలీసు నిధికి రూ. 5 లక్షలు
చిత్ర నిర్మాత పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ... సినిమా విడుదలకు, పైరసీ నివారణకు సహకరించిన పోలీసు యంత్రాంగానికి తాను రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కమిషనర్ తీరికి చేసుకుని టైం ఇస్తే అది అందజేస్తానన్నారు.
ఆస్ట్రేలియాలో అద్దాలు పగులగొట్టారు
సింహా చిత్రాన్ని చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆస్ట్రేలియాలో థియేటర్ అద్దాలు పగులగొట్టారు. అలాగే బెంగళూరులో కపాలి థియేటర్లో కెపాసిటీకి మించిన జనాలు కుర్చీలు వేసుకుని చూశారు. మొదటివారంలోనే 26 కోట్ల 45 లక్షల 75 వేల రూపాయలు వసూలయ్యాయి. ఇది రికార్డ్. ఇలాగే కొనసాగితే 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయం అని నిర్మాత చెప్పారు.