Sexy Anushka | Venkatesh | Doctor | Ramanaidu Studio | వెంకటేష్ చిత్రంలో పగతో రగిలిపోయే పాత్రలో అనుష్క
WD
అనుష్క దెయ్యం రూపంలో పగ ప్రతీకారంతో రగిలిపోయే సన్నివేశాలను రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించినట్లు తెలిసింది. దీక్షితులు పాత్రధారి అనుష్కను కంట్రోల్ చేసే సన్నివేశముంది. నేటితో ఈ సన్నివేశం పూర్తవుతుంది. ఈ నెల 12 నుంచి విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్ దగ్గర 40 లక్షల రూపాయల ఖర్చుతో వేసిన ప్యాలెస్ సెట్‌లో షూటింగ్ జరుగుతుంది.
జూన్ 10 వరకూ అక్కడ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. ఇందులో విలన్‌గా కన్నడంలో చేసిన అవినాష్ తెలుగులోనూ చేస్తున్నాడు. ఆ తర్వాత షెడ్యూల్ రాజస్థాన్‌లో ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో పూనమ్ కౌర్, కమిలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్య, సుజి, శ్రద్దా దాస్ తదితరులు నటిస్తున్నారు.