1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Simha

Nandamuri Balakrishna | Simha | Tollywood | Chiranjeevi | Nagarjuna | Venkatesh | Mahesh Babu | NTR | నేనే నెంబర్ వన్ అండ్ నెంబర్ జీరో

బాలకృష్ణ
WD
"సింహా" హిట్ తర్వాత బాలకృష్ణ స్పందనకోసం మీడియా ఎగబడుతోంది. బాలయ్య ఎక్కడ కనబడినా సింహా చిత్రానికి సంబంధించిన ప్రశ్నలను ఆయనపై సంధిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణను ఓ జర్నలిస్టు... సింహా టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేస్తోంది.

ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మీరే నెంబర్ వన్ అని భావిస్తున్నారా...? అని ప్రశ్నించాడు. దాంతో బాలకృష్ణ కాస్త గొంతు సవరించుకుని ఇలా సమాధానిమిచ్చారు.

గత 25 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోల చిత్రాలతో తన చిత్రాలను పోల్చుకుని చూసినప్పుడు ఓ విషయం బోధపడుతుందన్నారు. అదేమంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ నెంబర్ వన్ కాదన్న సంగతి.

ఒక సినిమా సూపర్ హిట్ అయితే మరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. హిట్ అయినప్పుడు నెంబర్ వన్ అంటారు.. ఫట్ మన్నప్పుడు జీరో అంటారు. ఏ హీరో చిత్రమైనా ఇదే వరస. కనుక హిట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క హీరో నెంబర్ వన్ అవుతాడు. ఫట్‌మంటే జీరో అయిపోతాడు.

నా కెరీర్‌లో నేను ఎన్నో హిట్ చిత్రాలతోపాటు ఫ్లాప్‌లను కూడా చూశాను. కనుక హిట్ అయినప్పుడు నేనే నెంబర్ వన్.. ఫ్లాప్ అయినపుడు నేనే నెంబర్ జీరో అని సెలవిచ్చాడు బాలకృష్ణ.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT