Adi Nuvve, Chaitanya, Aksha | "అది నువ్వే" లోగో ఆవిష్కరణ
WD
నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. తాను రొటీన్‌గానే హీరో ఫాదర్‌గా నటించినా , ఎంటర్‌టైన్మెంట్‌గా సాగే పాత్ర తనదని చెప్పారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగులో ఈ సినిమా చేస్తున్నాననీ, కామెడీకి ఆస్కారమున్న పాత్ర తనదని అన్నారు.
హీరో చైతన్య మాట్లాడుతూ, కథకు సూటయ్యే టైటిల్‌ను దర్శకుడు పెట్టారనీ, నిర్మాత రాజీపడకుండా ఈ చిత్రాన్ని చక్కగా తీశారని అన్నారు. యూత్‌కు బాగా నచ్చే చిత్రమని నటి అక్ష తెలిపింది. చిత్ర నిర్మాత కె. శ్రీకాంత్ మాట్లాడుతూ, డిసెంబరులో చిత్రాన్ని ప్రారంభించామనీ ప్రస్తుతం టాకీతోపాటు 4 పాటలు చిత్రీకరణ పూర్తయిందన్నారు.
రెండు పాటలను బ్యాంకాక్‌లో 13న చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంకా నరేష్, అమిత్, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. కెమేరా: పి.జి విందా, సంగీతం: థామస్