Jhummandi Nadam | Manchu Manoj | Lakshmi Prasanna | విదేశాలకు వెళుతున్న "ఝుమ్మంది నాదం"
WD
పెళ్లిసందడిలో సౌందర్య లహరి స్వప్నసుందరి అంటూ శ్రీకాంత్ పాడిన పాట హృదయాన్ని తాకక మానదు. ఈ చిత్రాన్ని పాటలు నిలబెట్టాయి. ప్రస్తుతం అదే తరహాలో రాఘవేంద్రరావు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ... యువతరాన్ని మాత్రమే కాకుండా అన్ని వయసులవారినీ అలరిస్తుందీ సినిమా. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
హైదరాబాద్, భద్రాచలం, అరకు, కేరళలో షూటింగ్ జరిపాం. ఈనెల 23న ముఖ్యమంత్రి రోశయ్య ఆడియోను ఆవిష్కరిస్తారు. బ్యాలన్స్ పాటలను విదేశాలలో చిత్రీకరించి జూన్ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, రవి బివిఎస్, మూలకథ: భూపతి రాజా, మాటలు: శశి రాజసింహ, ఎస్ గోపాల్ రెడ్డి, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్ కుమార్ రాజు