Balakrishna, Simha | Indrakeeladri | Gopichand | Golimar | Srisailam Mallanna | ఇంద్రకీలాద్రికి "సింహా"... మల్లన్నవద్దకు "గోలీమార్" గోపీచంద్
WD
తాజాగా "సింహా" బాలకృష్ణ తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. గురువారం సింహా యూనిట్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గ తల్లిని దర్శించుకున్నారు.
ఇక యువహీరో గోపీచంద్ సైతం తన "గోలీమార్" చిత్రం సక్సెస్ కావాలని కోరుతూ శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కుకున్నారు. అయితే సింహా చిత్రం ముందు నిన్న విడుదలైన రామరామ కృష్ణకృష్ణ కూడా నిలువలేకపోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గోలీమార్ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. మల్లన్న దయ చూపితే నెగ్గడం ఖాయమని గోపీచంద్ బలంగా నమ్ముతున్నాడు.