1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sidharth

Bava | Sidharth | Pranitha | నాలుగో షెడ్యూల్లో సిద్ధార్థ్ "బావ"

బావ
సిద్దార్థ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రణీత ఇందులో కథానాయిక. రాంబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. సిద్ధార్థ్ నుంచి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. చక్రి సంగీతం, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం, చింతపల్లి రమణ సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అని చెప్పారు.

నిర్మాత ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి మాట్లాడుతూ... ఇందులో రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. వారిద్దరి నడుమ సాగే సన్నివేశాలు కచ్చితంగా క్లాస్‌నీ, మాస్‌నీ అలరిస్తాయి. ఈ నెల 17 నుంచి నాలుగో షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతోంది. జూన్ 2 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు.

బ్రహ్మానందం, పవిత్రా లోకేశ్, రఘుబాబు, నాజర్, జోగి నాయుడు, ప్రభాస్ శ్రీను, వేణు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, సమర్పణ: సందీప్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT