Mayabazar colour | ANR | NTR | Savitri | SV Ranga Rao | ఏఎన్నార్ - ఎన్టీఆర్‌ల 100 రోజుల "మాయాబజార్"
WD
కలర్ ట్రేడింగ్ చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శతదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రసాద్, జగన్ మోహన్ రావు, శ్రీనివాస్‌లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కోడి రామకృష్ణ, ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ హాజరయ్యారు.
కోడి రామకృష్ణ మాట్లాడుతూ.... మాయాబజార్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు చాలదు. రోజులు పడుతుంది. అటువంటి చిత్రానికి సంబంధించిన శతదినోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కలర్ టెక్నికల్ హెడ్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ... ఈ చిత్రం కలర్ చేయాలంటే చాలా రిస్క్‌తో కూడిన పని. మొదట్లో చాలామంది ఎలా ఉంటుందో... పేరు చెడగొడతారేమోనని.. అసలు వద్దని రకరకాల సూచనలు చేశారు.
తొలుత మేము కూడా కాస్త భయపడినా.. మామూలుగా ఆడితే ఫర్వాలేదనుకున్నాం. కానీ 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడుతుందని అనుకోలేదు. ప్రేక్షకులు మాకు ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను కలర్ చేయాలనే ఉత్సాహం కలుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా మాయాబజార్ షీల్డులు కోడి రామకృష్ణ చిత్ర టెక్నికల్ యూనిట్‌కు అందజేశారు. అలాగే మాయాబజార్ డీవీడీలను కూడా మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.