1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Birth day

Jr NTR | Birth day | Hyderabad | Madhapur | అన్నీ తాత పోలికలే.. సిన్మాలు.. రాజకీయాలు.. ఆపై సీఎం

జూనియర్ ఎన్టీఆర్
WD
"రాష్ట్రంలో నేడు అనుకోకుండా తుఫాన్ వచ్చింది. తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం అభిమానులు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు. అందుకే నేను వారి తరఫున ప్రకటిస్తున్నా. అలాగే సేవా కార్యక్రమాల్లో నందమూరి అభిమానులు ముందుండాలని కోరుకుంటున్నా" అని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.

గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫంక్షన్లో మాదాపూర్ సైబర్ గార్డెన్‌లో పాల్గొన్నారు. భారీ ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమానికి తుఫాను ప్రభావం కారణంగా అనుకున్నంత భారీగా అభిమానులు రాలేకపోయారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కేక్ కట్ చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఆ తర్వాత కొడాలి నాని ఎన్టీఆర్‌కు బంగారు కిరీటాన్ని బహూకరించారు. మరొకరు పులి బొమ్మను ఆయనపైకి విసిరారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, "కాబోయే సీఎం బాలయ్యా.." అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడం కనిపించింది.

అయితే ఆ తర్వాత ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీపతిరాజేశ్వరరావు మాట్లాడుతూ... నందమూరి వంశంలో నాడు ఆ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ ఎన్టీఆర్ అభిమానులకు ఆరాధ్య దైవమని చెప్పారు. శ్రీపతి వ్యాఖ్యలను చూస్తే జూనియర్ ఎన్టీఆర్, తాత సీనియర్ ఎన్టీఆర్‌లా ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పినట్లుగా ఉందని కొందరు అనుకోవడం కనిపించింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT