1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ram

Ramarama Krishnakrishna | Ram | Arjun | Dil Raju | నేను "దేవదాసు" రామ్ ఫ్యాన్‌ను: అర్జున్

రామరామ కృష్ణకృష్ణ
WD
రామ్ నటించిన "రామరామ కృష్ణకృష్ణ" చిత్రంలో అర్జున్ నటించాడు. అంతకుముందు రామ్ చిత్రాలు చూసి తన ఫ్యాన్‌ను అయ్యానని అర్జున్ తెలిపారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాదులో జరిగింది. అంతకుముందే రామ్ మాట్లాడుతూ... అర్జున్ గారి మేనల్లుడు కథలు వస్తే అవి తనకు వినిపించేవారనీ, చాలా మంచి మనిషని కితాబిచ్చారు. ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...మా చిత్రం సక్సెస్ అయింది. చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఆంధ్రాలో తుఫాన్ రావడంతో అక్కడి ప్రజలు కకావికలులయ్యారు. వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.

అర్జున్ మాట్లాడుతూ... మంచి టీమ్‌తో నేను కూడా ఈ సినిమాలో భాగమయ్యాను. ఈ చిత్ర నిర్మాత రామానాయుడు, ఎస్.గోపాల్ రెడ్డి‌లా కమిట్‌మెంట్ ఉన్న నిర్మాత. సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నారు. వారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. చక్కటి స్క్రీన్‌ప్లేతో శ్రీనివాస్ తెరకెక్కించారు. రామ్ హీరోగా గత చిత్రాలు చూశాను. హీరోకు ఉండాల్సిన లక్షణాలున్నాయి. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ రీరికార్డింగ్. కీరవాణి అద్భుతంగా ఇచ్చారని తెలిపారు.

దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశాము. ప్రస్తుతం అవి లైలా తుఫానుతో అల్లాడుతున్నాయి. చాలా బాధగా ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుకుంటున్నామని చెప్పారు.

ఈ సినిమాకు ఐదవ పిల్లర్ అర్జున్ గారు. ఇందులో నటించిన హీరోయిన్లు తెలుగువారే. వారితో నటించడం తెలుగు సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో బిందుమాధవి, ప్రవీణ్, వంశీ, పృధ్వీ, శివన్నారాయణ, శ్రీనివాసరెడ్డి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి