Mahesh Babu | Anushka | Vedam | Panchakshari | Arundati | Trivikram Srinivas | Cinema | మహేష్-అనుష్కల చిత్రమా..? అయితే.. సూపర్‌హిట్టే..!
FILE
ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ.. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను సింగనమల రమేష్‌బాబు కనకరత్న మూవీస్‌పై నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి పాటల చిత్రీకరణ జరుగుతోందని శ్రీనివాస్ అన్నారు. ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. "అరుంధతి" బంపర్ హిట్ తర్వాత అనుష్క నటించిన వేదం, పంచాక్షరి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు అనుష్కకు మంచి గుర్తింపును సంపాదించిపెడతాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
ఈ నేపథ్యంలో యువరాజు మహేష్ బాబు సరసన అనుష్క నటిస్తోన్న తాజా చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అలాగే "అతడు" తర్వాత అనుష్క-మహేష్ బాబుల బ్లాక్ బస్టర్ మూవీ కోసం అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.