Rana | Leader | Hieght | Hindi films | Tamil Films | నా ఎత్తు దెబ్బకు విలన్, హీరోయిన్లు ఛేంజ్: రానా
WD
తన ఎత్తు తనకు ప్లస్‌గా ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చాలా సమస్యలను కలిగిస్తోందని అన్నారు.
హిందీలో అభిషేక్ బచ్చన్, ప్రీతి బబ్బర్‌లతో కలిసి నటిస్తున్న దమ్మరే దమ్ చిత్రంలో తొలుత తనకు జోడీగా నటించాల్సిన హీరోయిన్ తన ముందు మరుగుజ్జులా కనిపించడంతో సదరు నిర్మాత మరో హీరోయిన్‌ను బుక్ చేసినట్లు చెప్పారు.
అదేవిధంగా విలన్ కూడా తన హైట్ ముందు తేలిపోవడంతో తన ఎత్తుక తగ్గ విలన్‌ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
తమిళంలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో తొలుత ఒక హీరోయిన్‌ను అనుకుని ఎత్తు సమస్య వల్ల మరో హీరోయిన్‌ను నటింపజేస్తున్నారంటూ తన ఎత్తు ఎంతమంది ఆఫర్లను లాగేస్తుందో చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద "లీడర్"తో నటించాలంటే కనీసం లీడర్ భుజాల దాకా ఉండాల్సిందేనన్నమాట.