1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Twitter

Sherlyn Chopra |Twitter | నా ఫోటో చూశారా..? ఎలా ఉంది..?: షెర్లిన్ ప్రశ్న

షెర్లిన్ చోప్రా
IFM
షెర్లిన్ చోప్రా తన నగ్న శరీరాన్ని పూర్తిగా తన అభిమానులకు చూపించాలనుకున్న ఆశను నెరవేర్చుకుంది. తాజాగా తన నగ్న ఫోటోను నేరుగా ట్విట్టర్‌లో అప్ చేయడం ద్వారా తను అనుకున్నది చేసి పారేసింది.

శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించడమే కాక తన అభిమానులకోసమే అలా నగ్న ఫోటోను పెట్టినట్లు రాసుకున్నది. అయితే ఇంతకుముందు ఎన్నో నగ్న ఫోటోలలో దర్శనమిచ్చినా షెర్లిన్, తాజాగా ట్విట్టర్‌లో మాత్రం భిన్నమైన భంగిమలో కనబడుతూ టీనేజ్ కుర్రకారుకు హీటెక్కిస్తోందట.

ట్విట్టర్‌లో నగ్న ఫోటోను పెట్టిన విషయంపై షెర్లిన్‌ను కదిలిస్తే... నా ఆల్బమ్ కలెక్షన్లలో ఆ అందమైన ఫోటోను చూశా. ఆ ఫోటోను నా స్నేహితులతోపాటు ట్విట్టర్‌ను అనుసరిస్తున్న వీక్షకులు కూడా చూసి ఆనందిస్తారన్న తలంపుతో ఆ ఫోటోను అక్కడ పెట్టా. నా నగ్న ఫోటో ఎలా ఉందని ఎటువంటి సిగ్గు లేకుండా అడిగేస్తోందట.

ఇదిలావుంటే షెర్లిన్ నగ్న ఫోటోపై ట్విట్టర్‌లో భిన్నాభిప్రాయాల వరద వెల్లువెత్తుతోందట. కొంతమంది నగ్నంగా చాలా బావున్నావని పొగుడుతూ రాస్తుంటే మరికొందరు... నీకిదేం పోయే కాలం అంటూ విరుచుక పడుతున్నారట. ఎవరేమనుకున్నా తను ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతానంటోంది షెర్లిన్. గతంలో కూడా నగ్నంగా నటించిన ఓ వీడియోను విడుదల చేస్తే సెన్సార్ కత్తెర వేటు వేసింది. దీనిపై షెర్లిన్ చాలా కాలం పోరాడింది కూడా.
About Writer
Venkateswara Rao. I