Maa Annayya Bangaram | Rajasekhar | kamilini Mukharjee | రాజశేఖర్ "మా అన్నయ్య బంగారం"
WD
అనంతరం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేస్తామన్నారు. ఒక పాటను చెన్నైలో, జూన్ 27 నుంచి రెండు పాటలను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తామన్నారు. ఏషియన్ సంస్థ అధినేత నారాయణ ఈ చిత్రం నైజాం హక్కులు తీసుకున్నారనీ మిగతా ప్రాంతాల్లో క్రేజ్ ఉందని చెప్పారు. జులై 5 నాటికి షూటింగ్ ముంగించి, 27న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం హీరో చిన్ననాటి సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. రాజశేఖర్ కమిట్‌మెంట్ హీరోగా పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్‌లోనూ ఉంటూ సహకరిస్తున్నారన్నారు. కామెడీ సన్నివేశాలు జయప్రకాష్ రెడ్డి, మాస్టర్ భరత్‌ల మధ్య వచ్చేవి ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. ఈ చిత్రానికి కథ: భూపతి రాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, డి. ప్రసాద్ బాబు, సమర్పణ: మాస్టర్ నట్టిక్రాంతి