Sevakudu | Srikanth | Charmi | Samudra | నాలుగో షెడ్యూల్‌లో శ్రీకాంత్ - ఛార్మిల "సేవకుడు"
WD
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... శ్రీకాంత్ హీరోగా మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే కథతో మేము నిర్మిస్తున్న సేవకుడు చిత్రం మూడో షెడ్యూల్‌ని రామానాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్, నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోస్ మొదలైన ప్రాంతాల్లో జరిపాము.
ఛార్మిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఇందులో ఛార్మి జాబ్ కోసం తను చేసే ప్రయత్నాల్లో అనుకోకుండా ఓ సందర్భంలో శ్రీకాంత్‌ను కలిసి అతని లవ్‌లో పడుతుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనబడతారు అని అన్నారు.
శ్రీకాంత్ సరసన ఛార్మి నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్, సతీష్, సంగీత,శివాజీరాజా తదితరులు నటిస్తున్నారు.