Takita Takita | Bhumika | Bharat Takur | జులైలో "తకిట తకిట" విడుదల చేస్తాం: భూమిక
WD
సందేశాత్మకమైన పాత్ర. ఇన్ డైరెక్ట్‌గా సందేశం ఉంటుంది. ప్రేమను ప్రేమ ద్వారానే జయించాలి అనేది ఇందులోని పాయింట్. అనుష్క, నాగార్జునలు గెస్ట్ రోల్‌లో కన్పిస్తారు. జూన్ 18న ఆడియో విడుదలవుతుంది. జులైలో సినిమా విడుదల చేస్తాం అన్నారు.
చిత్ర నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎలాంటి ఫైనాన్స్ లేకుండా నిర్మించాం. మా టేస్ట్‌కు తగినట్లుగానే తీశాం. ఈ చిత్రం సామాన్య ప్రేక్షకుడికి కూడా నచ్చే విధంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఓ వందమంది కాలేజీ విద్యార్థినీవిద్యార్థులకూ చూపించి వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం.
పాటలు బాగా వచ్చాయి. శ్రీహరి టేకింగ్ బాగుంది. సినిమా ఆడితే పెట్టిన దానికి డబుల్ వస్తుంది. పోతే పెట్టింది మొత్తం తుడిచి పెట్టుక పోతుంది. భవిష్యత్‌లో కూడా అవకాశం ఉన్నప్పుడు సినిమాలు తీస్తూనే ఉంటాం అన్నారు.