Allu Arjun | Vedam | Jubli Hills | అర్జున్ పాకీవాడుగా నటిస్తే అది బయట కూడా చేయిస్తారా...?
WD
దీనిని కవర్ చేసేందుకు పొలోమంటూ... కెమేరాలు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియా వెళ్లింది. అయితే... అక్కడ అందరూ అభిమానులే ఉండాలన్న రూలేమీ లేదు కదా... వీరి రాకతో కాస్త హడావిడి జరిగి పక్కనే ఉన్న కొన్ని ఇళ్లపై జనాలు ఎక్కి ఇంటి రేకుల్ని పచ్చడిపచ్చడిగా తొక్కి పడిపోయేలా చేశారు.
దీంతో ఆ ఇంటి యజమాని కోపంతో ఊగిపోతూ... నానా తిట్లు తిట్టడమే కాక... అల్లు అర్జున్ పాకీవాడుగా నటిస్తే.. ఆ పనిని కూడా బయట చేయించి షూట్ చేస్తారా..? అంటూ విరుచుక పడ్డాడు.
ఇదేదో రాద్దాంతం అయ్యేట్లుగా ఉందని అక్కడ మీడియానే కాస్త క్షమించమని వేడుకుంది. వారికి తగిన పరిహారం ఇచ్చేలా చూస్తానని ఓ అభిమాని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.