Allu Arjun | Gangotri | Arya | Dance | రాత్రంతా గంతులేసిన అల్లు అర్జున్..!!
WD
"గంగోత్రి" నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. అయితే "ఆర్య" సినిమా విడుదలయ్యాక వారం వారం ఆదరణ పెరగడం... 50 రోజులకు చేరాక మరింతగా హిట్ టాక్ రావడంతో తెగ సంబరపడిపోయి... 10మంది స్నేహితులతో ఓ ప్లేస్‌ను బుక్ చేసుకుని డాన్స్ చేశానంటూ చెప్పాడు. మరి అంత ఎనర్జీ కావాలంటే... మందు పడాలి కదా... అని చెప్పకనే చెప్పాడు.
"నా టాలెంట్ ఏమిటో నాకు తెలుసు. నా నుంచి డాన్స్‌ను మాత్రమే ఆశిస్తారని అన్నాడు. 7అప్ కూల్‌డ్రింక్ యాడ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాని ప్రమోషన్లో భాగంగా గురువారం హైదరాబాదులో కొత్త రకంగా ప్లాన్ చేశాడు. వెబ్‌కామ్‌లో 7అప్ యాడ్‌ను క్లిక్ చేస్తే అల్లు అర్జున్ డాన్స్ చేసే పాటలుంటాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఇవి చేయాలంటే... కూల్ డ్రింక్ కొనాలి. అందులో వివరాలుంటాయి. అదీ సంగతి...