Tollywood T20 | June 13 | Chiranjeevi | Balakrishna | Nagarjuna | Venkatesh | మాది ఉమ్మడి కుటుంబం అంటున్న "ఆ నలుగురు"
WD
వందేమాతరం అంటూ దేశభక్తిని నింపుతూ చిరంజీవి, బాలృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిందులు వేశారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం దీనికి వేదికైంది. ఇక హీరోయిన్లు ఛార్మి, అనుష్క, భూమిక, ప్రియమణి ఒక్కో హీరోకు ఒక్కొక్కరు ప్రచారకర్తగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ నెల 13న ఎల్.బి. స్టేడియంలో టాలీవుడ్ టి-20 క్రికెట్ పోటీ జరుగనుంది. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ... మేమంతా పేద సినీకళాకారుల సహాయర్థం, మా అసోసియేషన్ బిల్డింగ్ నిమిత్తం ఈ పోటీ నిర్వహిస్తున్నామన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ... ఇంతకుముందు రెండుసార్లు కప్‌ను అందుకున్నా. ఈసారి కూడా గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లవుతుందన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. వరద బాధితుల సహాయార్థం 20 రోజుల్లో స్టార్ నైట్ ఏర్పాటు చేశాం. అంతే వ్యవధితో ఈ తారల క్రికెట్‌ను సక్సెస్ చేస్తాం అన్నారు. నాగార్జున మాట్లాడుతూ... అవసరమైతే సచిన్‌ను మా టీమ్‌లోకి తీసుకుని కప్ గెలుస్తామని చమత్కారంగా చెప్పారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో ప్రముఖ నటీమణులు నృత్యం చేశారు.
ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమీషనర్ ఎ.కె. ఖాన్ కూడా హాజరయ్యారు. డ్రెస్ కోడ్‌ల చీటీలను ఆయనే తీశారు. అనంతరం సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ... సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. గత 15 రోజుల్లో అనేక ప్రాంతాల్లో దాడులు చేశామని తెలిపారు.