Geeta Arts | Nagachaitanya | Tamannah | Allu Aravind | గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నాగచైతన్య - తమన్నా సినిమా
WD
ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. ఓపెనింగ్ షాట్‌తో ఈ చిత్రం నిర్మాణం సోమవారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా రావల్సి ఉంది.. కానీ ఆయన రాజకీయాల పనిపై రాజమండ్రి వెళ్లడం వల్ల కుదరలేదని అల్లు అరవింద్ చెప్పారు. అందుకే దేవుని పటాలపై పూజ చేశామని చెప్పారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నామని అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఇది లవ్ యాక్షన్ అంశాలతో రూపొందే చిత్రం. హీరోహీరోయిన్లు ముద్దుముద్దుగా ఉన్నారు. కథకు సరిపడా కేస్టింగ్. కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ... మూడవ సినిమానే పెద్ద బ్యానర్‌లో చేయడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సుకుమార్ చాలా డెడికేటెడ్ గై. నా గత సినిమాలకంటే ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.