Pavan Kalyan | Jesus Chriest | Aditya Productions | పవన్ కల్యాణ్ హీరోగా ఆదిత్య ప్రొడక్షన్స్ సినిమా
ఏసు క్రీస్తు జీవితం గురించి నాలుగు భాషల్లో ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. విజయేంద్ర వర్మ, శ్రీరామదాసు, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంస్థ ఆదిత్య ప్రొడక్షన్స్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ఏసు క్రీస్తుపై నిర్మించే తమ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించడం విశేషం.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జీవితంపై దాదాపు 47 ఇంగ్లీషు చిత్రాలు వచ్చాయి. కింగ్ ఆఫ్ కింగ్స్, బెనహర్ వంటి ముఖ్యమైన చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఆ చిత్రాలంతటి భారీ స్థాయిలోనే, వాటికి భిన్నమైన తరహాలో ఆదిత్య ప్రొడక్షన్స్ చిత్రం ఉంటుంది. అందరికీ తెలిసిన కథనే కొత్తగా ఆవిష్కరించబోతున్నాం అన్నారు.
ప్రయోగాలకు మారుపేరైన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారు. కొండ కృష్ణంరాజుగారు నిర్మాత. ఈ నెల 30న ముంబైలో చిత్రీకరణ ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ సినిమా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో నిర్మితమవుతుంది. కాగా ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోషించే పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ అని చిత్ర నిర్మాత వెల్లడించారు.