1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Allu Arjun | Cinema | Allu Aravind | సినిమా కథను నేను నొక్కేశా: అల్లు అరవింద్

అల్లు అర్జున్
సినిమాల్లో కథలు చౌర్యం చేయడం మామూలే. అందుకే యూనిట్ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది యూనిట్ అందరికీ కథ చెప్పాలంటేనే భయపడతారు. కానీ అల్లు అరవింద్ మాత్రం అందరికీ తెలిసేటట్లుగా కథలు చౌర్యం చేశానని చెప్పారు.

విషయం ఏమంటే... అల్లు అర్జున్‌కు సుకుమార్ ఓ కథ చెప్పాడు. అది విని తెగ సంబరపడిపోయి ఎక్కడికి వెళ్లినా దాని గురించే చర్చ పెట్టేవాడు అల్లు అర్జున్. ఇది విన్న అల్లు అర్జున్ మేనేజర్ వాసు విషయం తెలుసుకున్నాడట. వాసు వెంటనే సుకుమార్‌ను కలిసి కథ గురించి అడిగాడు.

కథ చెప్పేశాడు. ఆల్రెడీ సుకుమార్‌తో వాసు నిర్మాతగా ఆర్య అనే సినిమా చేశాడు కూడా. ఈ సినిమా కూడా తనే చేద్దామని అనుకుని శ్రేయోభిలాషి అయిన అరవింద్ గారికి కూడా చెబుదాం అన్నాడు. ఓ ఆదివారంనాడు అరవింద్ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి కథ వినిపించారు.

బేసిక్ పాయింట్ బాగా నచ్చింది. బడ్జెట్ ఎంత అని అడిగారు. ఫలానా దాంట్లో తీద్దామనుకుంటున్నాం అని చెప్పాడు వాసు. నో.. అంతకంటే ఎక్కువవుతుంది. తీయడం చాలా కష్టం. అందుకే నాకే ఇస్తే గీతా ఆర్ట్స్‌తో చేసేద్దాం అన్నాడట. చేసేది లేక పెద్దాయన... కనుక ఓకే అన్నారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెపుతూ.. కథలు చౌర్యం చేయడమంటే ఇలాగా.. అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి