1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. కృష్ణుడు హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చిత్రం

Krisnudu, Satish, | కృష్ణుడు హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చిత్రం

కృష్ణుడు
కృష్ణుడు కథానాయకుడుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నవచిత్రాలయ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జూన్ 7న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాజోలులో ప్రారంభమైంది. తొలిషాట్‌కు ప్రముఖ న్యాయవాది పొన్నాడ హనమంతరావు కెమేరా స్విచాన్ చేయగా, ఎంఎల్సీ చైతన్యరాజు క్లాప్ ఇచ్చారు.

తొలిషాట్ దర్శకత్వాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తండ్రి తిరుపతిరావు నాయుడు నిర్వహించారు. జులై 20 వరకూ రాజోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగే ఈ చిత్రంలో కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమేరా: శరత్, సంగీతం: శ్రీవసంత్, నిర్మాతలు: నారాయణ్, రాధికా రాణి, రత్నకుమార్, కథ- స్ర్కీన్‌ప్లే- దర్శకత్వం: వేగేశ్న సతీష్
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి