1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. June 10

Balakrishna | June 10 | Birth day | Simha | అర్థ సెంచరీలో అడుగెడుతున్న "సింహా"కు శుభాకాంక్షలు

బాలకృష్ణ
WD
మనిషి జీవితం వందేళ్లు. అందులో సగభాగమైతే యాభై. సినిమా భాష కాబట్టి అర్థ శతదినోత్సవం అని అంటుంటాం. విషయం ఏమిటంటే... నందమూరి బాలకృష్ణ జన్మించి గురువారం నాటికి యాభై ఏళ్లు పూర్తయి 51లోకి అడుగుపెడతారు. 1960 జూన్ 10న ఎన్టీఆర్ - బసవతారకం దంపతులకు పుట్టిన బాలయ్య సినీరంగ ప్రవేశం నల్లేరుమీద నడకలా సాగింది.

1982లో వివాహం చేసుకున్నారు. ఆయనకు బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ సంతానం. మోక్షజ్ఞ తండ్రి వారసునిగా ఇప్పటికే తగిన తర్ఫీదులో ఉన్నాడు. బెల్లంకొండ సురేష్ కార్యాలయంలోని జిమ్‌లో ప్రతిరోజూ మోక్షజ్ఞ సీనియర్ కోచ్ సూచనల మేరకే బాడీ బిల్డింగ్ నేర్చుకుంటున్నాడు.

కాగా, నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును అభిమానుల సమక్షంలో గురువారం హైదరాబాదులో ఘనంగా జరుపుకోనున్నారు. ఆయన పుట్టినరోజునాడే డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న పరమవీరచక్ర సినిమా ప్రారంభం కానుంది. యూసుఫ్‌గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8.02 నిమిషాలకు ప్రారంభం కానుంది.

బాలకృష్ణ తన తండ్రి నందమూరి రామారావుతో కలిసి నటించిన తొలిచిత్రం తాతమ్మ కల. అక్కినేని నాగేశ్వరరావుతో భార్యాభర్తల బంధం చిత్రంలో నటించారు. 1974లో యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన మంగమ్మగారి మనవడు సినిమా తొలి రజతోత్సవ చిత్రం. కర్నాకటలో కూడా ఈ సినిమా 100 రోజులు ప్రదర్శించ బడింది.

ఇక బ్లాక్ అండ్ వైట్ సినిమా రామ్ రహీం. ఇందులో తన సోదరుడు నందమూరి హరికృష్ణతో కలిసి నటించారు. అలాగే కోదండరామిరెడ్డి కూడా బాలయ్యతో ఎక్కువ చిత్రాలకే దర్శకత్వం వహించారు. ఎక్కువగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది నందమూరి మోహనకృష్ణ ఆధ్వర్యంలోనే. బాలయ్యతో నాలుగు స్వర్ణోత్సవ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి.

బాలయ్య కెరీర్‌లో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ ఒక ఎత్తయితే... ఇటీవలే విడుదలైన సింహా అన్నిటికన్నా మరో ఎత్తు. మొదటివారంలోనే సింహా చిత్రం 26 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. అప్పటికే నాలుగు సినిమాలు అపజయంతో ఉన్న బాలయ్య ఈ సినిమా విజయం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం వల్లనేనని గుళ్లూగోపురాలు తిరగడం ప్రారంభించారు. ఆయన నటించిన 91వ సినిమా సింహా. మరోవైపు రాజకీయ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సన్నద్ధం అవుతున్నారు.

మరో విశేషం ఏమిటంటే... బాలకృష్ణ ఆధ్వర్యంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టాలీవుడ్ టి-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తోంది. 51 ఏళ్ల బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా...!!
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి