1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Parama Veera Chakra

Balakrishna | Parama Veera Chakra | Dasari | New film | Chandrababu | Hyd | అభిమానం డబ్బిచ్చి కొంటే రాదు: నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ
WD
WD
తమ కుటుంబ పట్ల కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న అభిమానం డబ్బిచ్చి కొంటే వచ్చింది కాదని, ప్రజల హృదయాల్లో నుంచి పెల్లుబికి వచ్చిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ తనకు అభిమానులను వారసులుగా ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు.

గురువారం ఆయన తన యాభైవ పుట్టిన రోజు వేడుకలతో పాటు తన కొత్త చిత్రం పరమ వీర చక్ర చిత్ర ప్రారంభోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్థానిక యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియాలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దక్షిణ భారత ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ నిర్మాతగా, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం దాసరి నారాయణ రావుకు 151వ చిత్ర కావడం గమనార్హం.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముహుర్తపు షాట్‌లో చెప్పిన డైలాగుతోనే చిత్రాన్ని ఎపుడు చూద్దామా అనే ఆత్రుత నెలకొందన్నారు. ఒక్క నందమూరి వంశంపై ఎలాంటి పాత్రలైనా పోషించగలరన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో పలుమార్లు బాలయ్య జన్మదినానికి బదులు.. జన్మభూమి మరింత బాగా జరుపుకోవాలని ఉచ్ఛరించడం గమనార్హం.

అనంతరం దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ ఈ చిత్రం గురించి తాను మాట్లాడటం సరికాదని, చిత్రమే మాట్లాడుతుందన్నారు. ఆ తర్వాత హీరో బాలకృష్ణ మాట్లాడుతూ తండ్రి నుంచి ఈ అభిమాన వారసత్వం పొందినట్టు తెలిపారు. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అభిమానం అనేది డబ్బులిచ్చి కొంటే వచ్చేది కాదని, ప్రజల హృదయాల నుంచి పుట్టుకొచ్చిందన్నారు.
About Writer
PNR