Sukumar | Arya | Nagachaitanya | Geeta Arts | ప్రేక్షకుల మైండ్ సెట్ సరిగ్గా లేదు: "ఆర్య" సుకుమార్
యువతను కొత్త మార్గంలో చూపిస్తున్నట్లు ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని పంపిన దర్శకుడు సుకుమార్. అప్పట్లో ఆర్య హిట్ అయితే యూత్ బాగా మారిపోయారనీ అందుకే అంతటి హిట్ వచ్చిందన్న స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే తాజాగా ప్లేట్ ఫిరాయించాడు.
జగడం, ఆర్య-2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బోర్లా పడటంతో ప్రేక్షకుల మీద మండి పడుతున్నాడు. ఎలాగోలా తిరిగి గీతా ఆర్ట్స్‌లో నాగచైతన్యతో మరో చిత్రానికి సిద్ధమయ్యాడు.
రెండు ఫ్లాప్‌ల తర్వాత మళ్లీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? ఫ్లాప్‌లకు కారణం ఏమిటని భావిస్తున్నారు...? అని అడిగితే.. ప్రతి సినిమా హిట్ కావాలనే తీస్తాం. పోతే చేసేదేముంది అన్నాడు. మీ అంచనాలకు ప్రేక్షకులు రీచ్ కాలేదా...? అని ప్రశ్నిస్తే... నేను తీసింది కరక్టే. ప్రేక్షకులే మారాలి. వారు మారకపోతే ఏం చేస్తాం... అంటూ స్పందించారు.
ఏదిబడితే అది తీస్తే ఎలా చూస్తారన్న ప్రశ్నకు.. ఆవేశంగా.. వాళ్ల మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు ఎన్ని సినిమాలు తీసినా వేస్టే అంటూ తీవ్రంగా స్పందించారు. దీంతో వివాదం మరింతగా పెరిగిపోతుందని గ్రహించిన గీతా ఆర్ట్స్ ప్రతినిధి సముదాయించాడు. సో... సినిమా ఫెయిల్ అయితే అది ప్రేక్షకుల తప్పు. సక్సెస్ అయితే దర్శకుడే రైట్.