Periyar Ramaswami | Satyaraj, | సత్యరాజ్ "పెరియార్ రామస్వామి నాయకర్"
WD
దాదాపు 300 చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు రవిశంకర్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ... డాక్టర్ అంబేద్కర్ చిత్రం తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు తెస్తుంది.
శంకర్ దాదా ఎంబీబీఎస్, విక్రమార్కుడు, పోకిరి, అరుంధతిలాంటి కొన్ని చిత్రాలే నాకు జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చాయి. ఈ పెరియార్ రామస్వామి నాయకర్ చిత్రం కూడా ఆ కోవలోకి చేరుతుంది అన్నారు.
సత్యరాజ్ పెరియార్‌గా నటించిన ఈ చిత్రంలో ఖుష్బూ, జ్యోతిర్మయి, నిళల్‌గళ్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతాన్నందించిన ఈ చిత్రానికి విప్లవ యోధుడు, అభ్యుదయ రచయిత కత్తి పద్మారావు సంభాషణలు రాయగా, గోరేటి వెంకన్న డాక్టర్ విద్యాసాగర్, అంగళకుర్తి, జైవీర్, రాజు పాటలు రాశారు.