1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Balakrishna

Paramaveera Chakra | Balakrishna | Dasari Narayana Rao | Chandrababu Naidu | "పరమవీరచక్ర" డ్రెస్ అదిరింది.. పోస్టరూ అదిరింది...

పరమవీరచక్ర
WD
బాలకృష్ణ 50వ పుట్టినరోజు వేడుకతోపాటు దాసరి నారాయణరావు "పరమవీరచక్ర" సినిమా ప్రారంభోత్సవం కూడా మొదలైంది. ఈ కార్యక్రమంలో బాలయ్య మెరిసేటి దుస్తుల్లో తళతళలాడారు. దీంతోపాటే ఆయన వెనుక ఉన్న "పరమవీరచక్ర" సైనికుడి గెటప్ కూడా "సింహా" మీసకట్టుతో అలరించింది.

అయితే సింహా అవతారాన్నే పరమవీరచక్రలో కూడా దాసరి నారాయణరావు ఫాలో అవుతారా...? అనే మాటలు ఆ పోస్టరు చూసినవారు అనుకోవడం వినిపించింది. ఏదేమైనా పరమవీరచక్ర లాంఛింగ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నందమూరి కుటుంబం, ఆ కుటుంబం అభిమానుల సమక్షంలో అదిరిపోయింది.

అలనాడు ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దాసరి, యువరత్న బాలకృష్ణ "పరమవీరచక్ర"ను ఎలా తీర్చిదిద్దుతారనేది వెండితెరపై చూడాలంటే సంక్రాంతి పండుగ దాకా ఆగాల్సిందే.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి