Tollywood t20 | Murali Mohan | Media | Chiranjeevi | Balakrishna | Nagarjuna | Venkatesh | బొట్టుపెట్టి పాసులివ్వాలా...?: మీడియాపై మురళీమోహన్ చిందులు
WD
"మీకు బొట్టుపెట్టి పాసులివ్వాలా...? ఎప్పుడివ్వాలో మాకు తెలుసు..?" అంటూ చిర్రుబుర్రులాడినట్లు సమాచారం. దీంతో పాత్రికేయులు తీవ్ర అసంతృప్తిని తెలిపారు. మొన్నటివరకూ తమను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఇపుడు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంపై ధ్వజమెత్తుతున్నారు.
మరోవైపు టాలీవుడ్ టి-20 టిక్కెట్ల కొనుగోళ్లు కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లు సమాచారం. రూ. 200 టిక్కెట్లు అమ్ముడయినంత జోరుగా రూ.10 వేల టిక్కెట్లు పోలేదని తెలిసింది. దీంతో మురళీమోహన్ చికాకుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
తారాతోరణం అంతా కలిసి క్రికెట్ ఆడటానికి వస్తున్నప్పటికీ ప్రజల నుంచి అంతగా స్పందన లేకపోవడంపై నిరాశకు లోనై చివరి నిమిషంలో మ్యాచ్‌పై అసక్తత వ్యక్తం చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు సంగతేమిటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.