1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Telangana Agitators

Tollywood t20 | Telangana Agitators | LB Stadium | తారల టి-20 క్రికెట్‌కు తెలంగాణావాదులు అడ్డయితే...?

టాలీవుడ్ టి20
WD
టాలీవుడ్ టి-20 సజావుగా జరుగుతుందా..? లేదా..? అనే సందేహం నిర్వాహకుల్లో కలుగుతోంది. ఇప్పటికే రెండ్రోజులుగా నిర్వాహకులు ఎల్బీ స్టేడియంను పరిశీలిస్తున్నారు. ఎ.కె.ఖాన్ ఆధ్వర్యంలో పూర్తి రక్షణ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభించారు. తెలంగాణా వాదులు క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చనే సమాచారం మేరకు పోలీసు కమీషనర్ అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పుడే ఏర్పాటైన సమావేశంలో రేపు మ్యాచ్ ఎలాంటి పరిణామాల్లో జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమిషనర్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఒక్కసారి ఎల్బీ స్టేడియంలోకి వచ్చినవారు మళ్లీ బయటకు వెళితే.. తిరిగి లోనికి రావడం కష్టమవుతుందని చెప్పారు. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కాగా, మరోవైపు వరుణ దేవుడు కూడా వస్తే.. పరిస్థితి ఏమిటనేది మురళీమోహన్ ఆధ్వర్యంలో ఉదయమే సమావేశమై చర్చించారు. ఆటగాళ్లకు వర్షం వల్ల ఇబ్బంది వస్తే.. మధ్యలో కబడ్డీలాంటి ఆటను ఆడిస్తే ఎలా ఉంటుందని ఓ కమిటీ సభ్యుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దానికి నో.. అనే సమాధానం ఎవరూ చెప్పలేదు. ఏదేమైనా అభిమానులను నిరాశపర్చకుండా నిర్ణయాలు తీసుకోవాలని నిర్వహకులు చర్చ ముగించారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి