1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Suhasini

Villain | Suhasini | Maniratnam | Ishwarya | Vikram | Abhishek | పుట్టింటికి అల్లుడిని తీసుకొచ్చా..!: సుహాసిని

విలన్
WD
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "విలన్" సినిమా ప్రమోషన్‌‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ నక్షత్ర హోటల్‌లో సందడి చేసింది.

తెలుగులో విలన్, హిందీలో రావణ్, తమిళంలో రావణన్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హైదరాబాద్ తాజ్ కృష్ణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని వ్యాఖ్యతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త రూపొందించిన "విలన్" ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చెప్పారు. మంచి - చెడు రెండు కలిస్తేనే మనిషని ఇదే పాయింట్‌తో విలన్ కథాంశం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన తాను 22 ఏళ్ల తర్వాత అల్లుడిని పుట్టింటికి తీసుకొచ్చినట్టు మీడియా ప్రతినిధులకు సుహాసిని తెలిపారు.
About Writer
SELVI.M