Pawan Kalyan | Malayalam | Yeshu christ | Sri Ramadoss | Vijayendra varma | మలయాళంలో నటించబోతున్న ''పవర్ స్టార్'' పవన్ కళ్యాణ్!
FILE
అటువంటి తెలుగు చిత్ర రంగానికి చెందిన అగ్రహీరో పవన్ కళ్యాణ్ తొలిసారి మలయాళంలో నటించబోతున్నారు. ఈ సినిమా హక్కులను తెలుగు నిర్మాత కృష్ణంరాజు సొంతం చేసుకోవడం గమనార్హం.
గతంలో "విజయేంద్రవర్మ" వంటి భారీ చిత్రాన్ని, "శ్రీరామదాసు" వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన కృష్ణంరాజు తన తృతీయ ప్రయత్నంగా ఏసుక్రీస్తు జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిర్దేశకత్వం వహిస్తున్నారు.
12, 14 సంవత్సరాల వయసు కలిగిన బాల తారలతో ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో నిర్మిస్తుండటం విశేషం. ఈ కథలో ఒక కీలకమైన, కథకు ప్రాణం అని చెప్పదగిన పాత్రన పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఇదే పాత్రను పవన్ తెలుగు, మలయాళంలో పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఆయా భాషలకు చెందిన ఇద్దరు ప్రముఖ కథానాయికలు పవన్ కళ్యాణ్ సరసన నటిస్తారని చెప్పారు. కాగా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తయారయ్యే వెర్షన్‌లో ఆ భాషలకు చెందిన ప్రముఖ హీరో, హీరోయిన్లు నటిస్తారని కొండా కృష్ణంరాజు తెలిపారు.
ఈ నెల 30న ముంబైలో షూటింగ్‌ను ప్రారంభించి, 80 శాతం వరకు ఈ చిత్రం షూటింగ్‌ను ఈజిప్టు, ఇజ్రాయెల్, ఇటలీలో జరుపుతామని ఆయన వెల్లడించారు. ఇంకా ఈ చిత్రానికి రచన : జె.కె. భారవి, కెమెరా : శేఖర్ వి. జోసెఫ్, ఆర్ట్ : రవీందర్, మేకప్ : క్రిస్టియానా టిన్స్‌లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శేషు.