1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. పోలీస్ వ్యవస్థ, సమాజంలో మార్పు కోసం పోరాడే "భైరవ"

Bhairava, Real star srihari, Hyderabad, Shooting, Ramoji film city | పోలీస్ వ్యవస్థ, సమాజంలో మార్పు కోసం పోరాడే "భైరవ"

భైరవ
FILE
రియల్‌స్టార్ శ్రీహరి హీరోగా విశాఖ టాకీస్ పతాకంపై ప్రారంభమైన "భైరవ" చిత్రం షూటింగ్ ఈ నెల నాలుగో తేదీ నుంచి హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్‌లలో జరిగింది. ఈ నెల 14 నుంచి రామోజీ ఫిలింసిటీలో వరుసగా ఐదురోజుల పాటు షూటింగ్ జరుపుకుని, వచ్చేనెల మొదటివారంతో హైదరాబాద్ షూటింగ్ పూర్తవుతుంది.

ఆ తర్వాత జూలై 7 నుంచి చెన్నైలో మొదలై 22వ తేదీతో ముగుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నట్టికుమార్ చెప్పారు.

శ్రీహరి పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన మార్కు యాక్షన్‌తోపాటు ఇంతకుముందు ఆయన నటించిన పోలీసు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు.

పోలీస్ వ్యవస్థని, సమాజాన్ని మార్చడానికి కృషి చేసే సీనియర్ పోలీస్‌గా శ్రీహరి నటిస్తున్నారని దర్శకుడు పోలూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ చిత్రంలో శ్రీహరి సరసన అర్చన కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం శ్రీలేఖ, కెమెరా: జస్వంత్.
About Writer
SELVI.M