1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Siddharth

Bava | Siddharth | Pranita | Dr. Rajendra Prasad | Annavaram | Shooting | అన్నవరంలో సిద్ధార్థ్, ప్రణీతల "బావ" సినిమా షూటింగ్!

బావ
WD
సిద్ధార్థ్, ప్రణీత జంటగా నటిస్తున్న చిత్రం "బావ". రాంబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ.. "రాముడు, సీతలాంటి బావామరదళ్ల మధ్య రావణాసురుడి లాంటి ఒక పాత్ర ప్రవేశిస్తాడు. అతను పెట్టే సమస్యలను, ఆ అవరోధాలను హీరో ఎలా అధిగమించి తన మరదలను దక్కించుకుంటాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇందులో తండ్రీ కొడుకులుగా డాక్టర్. రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ్ నటిస్తున్నారు. తన కొడుక్కి స్నేహితునిలా, తండ్రిలా, గురువులా ఉంటూ, తన కుమారుడి ప్రేమకోసం రాజేంద్రప్రసాద్ ఏం చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత పత్రి తండ్రీ, కొడుకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు" అని చెప్పారు.

నిర్మాత ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి మాట్లాడుతూ.. "ఈ నెల 23 నుంచి అన్నవరంలో ఐదో షెడ్యూల్ మొదలవుతుంది. జూలై 14వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. అన్నవరంతో పాటు అరకులోయ, ఉభయగోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతాం. ప్రధాన సన్నివేశాలతో పాటు మూడు పాటలు, ఫైట్, క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దీంతో పాట, ఫ్లాష్‌బ్యాక్, కొంత టాకీ మినహా సినిమా పూర్తవుతుంది." అని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు : చింతపల్లి రమణ, సంగీతం : చక్రి, కెమెరా : అరవింద్ కృష్ణ, ఎడిటింగ్ : గౌతంరాజు, సమర్పణ : సందీప్.
About Writer
Gulzar Ghouse