Abhishek bachan | Aishwarya rai | Vikram | Priyamani | Villain | Ravan | Ravana | Maniratnam | Suhasini | "విలన్"లో రాగిణి పాత్రకు ఆ శక్తి ఉంది: ఐశ్వర్యారాయ్
WD
ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నటీనటులతో మణిరత్నం రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన "విలన్" ప్రమోషన్ కార్యక్రమంలో నిర్మాత సుహాసిని మణిరత్నం విలేకరి బాధ్యతను తీసుకుని విక్రమ్‌ను, ఐశ్వర్యారాయ్, ప్రియమణిలపై ప్రశ్నలు సంధించారు. ఇందులో సుహాసిని అడిగిన ప్రశ్నలు మీ కోసం..
ముందుగా ఐశ్వర్యారాయ్‌పై సుహాసిని వేసిన ప్రశ్నలకు ఆమె ఎలా సమాధానమిచ్చారో చూద్దాం..!
ప్రశ్న: తమిళంలో తొలిసారిగా పరిచయం చేసిన మణిరత్నంతో మళ్లీ రావణ్ సినిమాలో నటించిన అనుభవం గురించి..?
జ: మొదటి తమిళ సినిమా "ఇరువర్"లో నటించాను (తెలుగులో ఇద్దరు). తర్వాత 'గురు'లో లిటిల్‌మిడిల్ ఏజ్ పాత్ర పోషించాను. మణిరత్నం గొప్ప దర్శకులు. అందుకే 'విలన్'లో ఆయన చెప్పినట్లే చేశాను. మొదటిసారి సినిమాలో లెంగ్తీడైలాగ్‌లు కూడా చెప్పారు. అవి చెప్పగానే ఓకే అనేశారు.
ప్రశ్న: రాగిణి పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు.?
జ: విలన్‌లోని రాగిణి పాత్రకు దేనినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మంచి చెడు గురించి ఆలోచించే పాత్ర అది. కోపం వస్తే పులిగా విజృంభిస్తుంది. మరికొన్ని సన్నివేశాల్లో సాఫ్ట్‌గా ఉంటుంది.
ప్రశ్న: విక్రమ్ మీకు భర్తగా, విలన్‌గా నటించారు. ఎలా ఫీలయ్యారు?
జ: తమిళంలో విక్రమ్ భార్యగా నటించాను. తెలుగులో ఆయన నెగటివ్ పాత్ర పోషించారు. హిందీలో అభిషేక్ బచ్చన్ భర్తగా నటించారు. ఎవరూ నటించినా అదంతా కథమేరకే. నటుడిగా విక్రమ్ పరిణితి చెందిన వ్యక్తి. మొత్తానికి మణిరత్నం చెప్పినంతవరకే నటించాను.
ప్రశ్న: డ్రెస్‌కోడ్ విషయంలో ఇబ్బంది పడ్డారా..?
జ: మూడు భాషల్లో నటించినప్పుడు ఆ ఇబ్బందిరాలేదు. చాలా కాన్ఫిడెన్స్‌గా చేశాను.
ప్రశ్న: తమిళంలో, హిందీలో నటిస్తున్నారు. మరి తెలుగులో ఎప్పుడు నటిస్తారు?
జ: మణిరత్నం చెప్పినట్లే త్వరలో నటిస్తాను.
నేను ఐశ్వర్య అభిమానిని: ప్రియమణి
ప్రశ్న: ఐశ్వర్య నటించే చిత్రంలో చేసినా కలిసి చేయలేకపోయాననే ఫీలింగ్ ఉందా?
జ: ఐశ్వర్యతో కలిసి చేయలేకపోయినా ఆమె నటించిన చిత్రంలో చేయడం హ్యాపీగా ఉంది. నేను, మా అన్నయ్య ఐశ్వర్య అభిమానులం.
ప్రశ్న: హిందీలో పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?
జ: మద్రాస్ టాకీస్ నుంచి ఫోన్‌రాగానే చాలా ఎక్సైట్‌కు గురయ్యాను. ఒక్కసారైన మణిసార్ చిత్రంలో నటించాలనే కోరిక ఉండేది. వెంటనే విమానంలో ఢిల్లీకి వెళ్లాను. నీకు హిందీ వచ్చా..? అని అడిగారు. నేను హిందీ స్కూల్లో హిందీ చదివాను అని చెప్పాను. వెంటనే అసిస్టెంట్ డైరక్టర్‌ను పిలిచింది. నా హిందీ పరీక్షించమన్నారు. నేను చెప్పిన డైలాగ్‌లు విని, ఓకేసార్.. బాగానే ఉంది అని చెప్పగానే.. ఎగిరి గంతేశావు. మొత్తానికి విలన్‌లో నటించడం ద్వారా నా కల నిజమైంది.
ప్రశ్న: మీరు డ్రెస్‌కోడ్‌లో ఏమైనా ఇబ్బంది పడ్డారా?
జ: తెలుగులో మల్లెపువ్వులు, వడ్డాణం వేసుకోవాలి. హిందీలో గాగ్రాచోళి వేసుకున్నా. తమిళంలో నేటివిటీని బట్టి దుస్తులు ధరించాను. మూడు చోట్ల భిన్నమైన పాత్ర చేయడం హ్యాపీగా ఉంది.
తన భర్త, మణిరత్నంపై సుహాసిని ఇలా ప్రశ్నించారు.
ప్రశ్న: రోజా, బొంబాయి చిత్రాలు ఒక్కోటి ఒక్కో సామాజిక సమస్యలను టచ్‌చేసిన మీరు "విలన్"లో చూపిస్తున్నారు.?
జ: ప్రతి సినిమా ఒకే ఆర్డర్‌లో ఉంటుందని చెప్పలేను. చిత్ర చిత్రానికి మార్పు ఉంటుంది. "విలన్" కూడా నేటి ట్రెండ్‌కు తగిన సినిమానే. చూసిన తర్వాత మీరే చెబుతారు.
ప్రశ్న: పోస్టర్లు చూస్తుంటే..? రోషం, పలు ఆంగ్ల సినిమా ఛాయలు కన్పిస్తున్నాయి కదా? దీనిపై మీ స్పందన?
జ: మీకు అలా కనిపిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉంటుందా?. ఈ చిత్ర పోస్టర్లు ఆ రేంజ్‌లో ఉందని మీకు అనిపిస్తే నాకూ చాలా సంతోషమే...!