Rajasekar | Kamalini mukarjee | Maa annayya bangaram | Bramhanandam | Jayaprakash Reddy | రాజశేఖర్‌కు "బంగారం"లాంటి సినిమా అవుతుంది..!: పరుచూరి
WD
ఈ చిత్రం గురించి మంగళవారం నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. "ఇందులో రాజశేఖర్ అద్భుతంగా నటించారు. ఇటువంటి కథలకు ఆయనే చక్కగా సూటవుతారు. కమిలినీ ముఖర్జీ పాత్రకు సరిపోయింది రాజశేఖర్‌తో కథలు రాసిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్‌పైకి తీసుకెళ్లాం. రాఘవేంద్రరావు శిష్యుడు బి. గోపాల్ ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే అందులో తలెత్తిన అనుమానాలు అడుగుతుంటారు. అదే కోవలో జొన్నలగడ్డకూడా కొన్ని అనుమానాలను నివృత్తిచేసుకుంటారు. మంచి దర్శకునికి గల లక్షణాలు జొన్నలగడ్డలో ఉన్నాయి. రాజశేఖర్‌కు నిజంగా బంగారంలాంటి సినిమా అవుతుంది. జయప్రకాష్‌రెడ్డి పాత్ర కామెడీని అద్భుతంగా పండిస్తుంది" అని అన్నారు.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. "ఇందులో ప్రతి పాత్ర కథకు చక్కగా అమరుతుంది. ఐదు పాటలూ ముత్యాల్లా ఉన్నాయి. తొలికాపీ ఎప్పడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పారు.
కథానాయిక కమలిని ముఖర్జీ మాట్లాడుతూ.. "ట్రెడిషన్, మోడ్రన్ కలగలిపిన కథ ఇది. మంచి పాత్ర చేస్తున్నాను. నా తోటి నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు" అని తెలిపారు.
జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. " నన్ను విలన్‌గా చూసిన ప్రేక్షకులు ఇందులో కామెడియన్‌గా చూస్తారు. నాకు ఇలాంటి పాత్రనిచ్చిన జొన్నలగడ్డ శ్రీనును అభినందిస్తున్నాను. ఇందులో హీరోకి బాబాయ్ పాత్ర చేస్తున్నాను" అని వెల్లడించారు.
నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమైంది. నేటికి 45 రోజులు షూటింగ్ జరిగింది. సీమంతం సాంగ్ స్విట్జర్లాండ్ వెళ్ళి తీస్తాం. అనుకున్నట్లు వచ్చేనెల 29న సినిమాను విడుదల చేస్తాం" అని తెలియజేశారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్, కెమెరా: డి.ప్రసాద్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీను.