1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Charmi

క్లైమాక్స్ మినహా థ్రిల్లర్ మూవీ 'మంగళ' షూటింగ్ పూర్తి!

మంగళ
WD
"మంత్ర" ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "మంగళ". ఓషో తులసీరామ్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న థ్రిల్లర్ "మంగళ".. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో పాటల చిత్రీకరణ జరుపుకుంది.

క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకనిర్మాత ఓషో తులసీరామ్ మాట్లాడుతూ.. "ఇదొక విభిన్న చిత్రం. ఛార్మి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' ఎంతటి విజయంసాధించింతో, అంతకు మించిన విజయం ఈ 'మంగళ' సాధిస్తుందని ఆశిస్తున్నాను. పాటలతో సహా టాకీ పార్టుతో పాటు షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నాం" అన్నారు.

ఛార్మి, ప్రదీప్‌రావత్, సుభాష్, విజయ్‌సాయి, పావల శ్యామల, ఉత్తేజ్, సారికా రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జంధ్యం వెంకటేష్‌బాబు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, విశ్వ. సంగీతం: విశ్వ, కెమెరా: శివేంద్ర, కో ప్రొడ్యూసర్: బి. నాగేశ్వర్‌రెడ్డి, సమర్పణ: జి. శ్రీధర్, నిర్మాతలు: తులసీరామ్, సీహెచ్‌వీ శర్మ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: తులసీరామ్.