1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Suhasini

Rajendra Prasad | Suhasini | Usha Charan creations | Naresh | Kaveri jha | Dinesh Babu | రాజేంద్రప్రసాద్ సరసన నటిస్తున్న సుహాసిని!

రాజేంద్రప్రసాద్
WD
సుప్రసిద్ధ నటుడు డాక్టర్. రాజేంద్రప్రసాద్, సుహాసిని నాయికా నాయికలుగా ఉషాచరణ్ క్రియేషన్స్ కొత్త చిత్రం రూపొందించనుంది. ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్-సుహాసిని జోడీగా నటించబోయే ప్రథమ చిత్రాన్ని జొన్నాడ రమణ మూర్తి నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో దాదాపు 32 చిత్రాలకు పైగా దర్శకత్వం, వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రహణ దర్శకత్వం నెరపిన "దినేష్‌బాబు" ఈ చిత్రానికి డైరక్షన్ వహిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దినేష్‌బాబు మాట్లాడుతూ.. వినోదభరితంగా రూపుదిద్దుకునే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.

ఇందులో ఐటీ ఆఫీసర్‌గా కథానాయకుడు రాజేంద్రప్రసాద్, ఆయన భార్య బ్యాంక్ ఉద్యోగినిగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగే జీవిత కథను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దినేష్ బాబు తెలిపారు. ప్రేక్షకులను వినోద ప్రపంచంలో విహరింపజేసేలా చిత్రకథ, కథనాలు వుంటాయన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. గంగోత్రి విశ్వనాథ్ సంభాషణలు, ఇ.ఎస్. మూర్తి సంగీత, సాహిత్యాలు, దినేష్ బాబు దర్శకత్వ నేర్పు ఈ చిత్రాన్ని విజయం వైపు పయనింపజేస్తుందని ఆశించారు.

ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో.. సీనియర్ నటుడు నరేష్, కావేరిఝా, రఘుబాబు, హర్షవర్షన్, ఝాన్సీ, రజిత, శిల్ప, సందీప్తి, ఉషశ్రీ, రమ్యశ్రీ, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు. ఇకపోతే.. ఈ చిత్రానికి ఆర్ట్: మురళి, కాస్టూమ్స్: కానూరి బ్రదర్స్.
About Writer
SELVI.M