1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Skin Show

Bollywood | Skin Show | Lip to lip kiss | టాప్‌లెస్‌గా నటించేందుకు పోటీపడుతున్న సెలెబ్స్

సెలబ్రిటీలు
నాభీ భాగాన్ని ముందుకూ వెనుకకూ ఊపుతూ.. అటూ ఇటూ తిప్పుతూ నాట్యం చేయడం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు టాప్‌లెస్‌గా నటించడం లేటెస్ట్ ట్రెండ్ అని చాటిచెపుతున్నారు బాలీవుడ్ తారలు. వీలుచిక్కినపుడల్లా బికినీలు వేస్తూ వీపు భాగాన్ని పూర్తి నగ్నంగా చూపుతూ టీనేజ్ కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు మహా యత్నిస్తున్నారు.

బాలీవుడ్ బేర్ బ్యాక్ బ్యూటీలుగా పేరు తెచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నవారు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న కైట్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి బార్బరా నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించింది. సన్నివేశ ఔచిత్యాన్ని అనుసరించి ఎలాగైనా నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చేసింది. అయితే కైట్స్‌లో ఆమె అర్థ నగ్న సౌందర్యాన్ని భారత వెండితెరల పైకి తీసుక రాలేదనుకోండి.

ఇక హిస్‌స్ చిత్రం ద్వారా నాగిని పాత్రలో కనిపించనున్న మల్లికా శరావత్ సైతం పాము వేషధారణలో నగ్నంగా కనిపించిందంటున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రషెస్ చూసిన మల్లికా తన నగ్న శరీరాన్ని కనబడకుండా కాస్తంత షేడ్ చేయమని చెప్పిందట. దీంతో దర్శకుడు ఆమె చెప్పినట్లే కొన్ని మార్పులు చేసి ఆమె నగ్న శరీరాన్ని నీలి రంగు తెరల మాటున కనిపించీ కనిపించకుండా చిత్రీకరించాడట.

ఇక ముద్దు సన్నివేశాలంటారా... గాఢ చుంబన దృశ్యాలు ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలోనూ సర్వసాధారణమైపోయాయి. ఇంకా అంతకుమించిన ఘాటు ముద్దు ఏదైనా చూపించాలని దర్శకులు తెగ ట్రై చేస్తున్నారు. దీనికితోడు నెంబర్ గేమ్‌లో ముందుకు ఉరికేందుకు, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించేందుకు ఎటువంటి ముద్దు సీన్లలో నటించేందుకైనా తాము సిద్ధమని నటీనటులు సైతం అంటున్నారు.
 
FILE


మొత్తమ్మీద హాలీవుడ్ నటీమణుల నగ్న నటనను మన బాలీవుడ్ నటీమణులు అనుకరించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మేర అనుకున్నది అనుకున్నట్లుగా చేసేస్తున్నారు. మిగిలిన 50 శాతం కోసం ప్రయత్నిస్తున్నట్లు కనబడుతున్నారు.

సినిమాల తీరు ఇలా ఉంటే టీవీ సీరియళ్లు సైతం తమ నగ్నత్వాన్ని క్రమంగా బయటపెడుతున్నాయి. ఇటీవల ఓ రియాలిటీ షోలో టీవీ నటి శ్వేతా తివారీ ఆచరించే స్నానఘట్టాన్ని బుల్లితెర ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్‌కు మించిన స్థాయిలో ఈ రియాలిటీ షోలలో బుల్లితెర నటీమణుల స్కిన్ షో ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో హీరోయిన్ల స్కిన్ షో చూడలేక టీవీలు చూస్తుంటే, టీవీల్లోనూ స్కిన్ షో ప్రదర్శనలు మొదలవడంతో బుల్లితెర వీక్షకులకు ఏం చూడాలో తెలియని స్థితిలో పడిపోతున్నారు.
About Writer
Venkateswara Rao. I