1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. 100 Days

Simha | 100 Days | Sneha Ullal | Namitha | 50 Days | 338 కేంద్రాల్లో బాలయ్య "సింహా" కలెక్షన్స్ అదుర్స్!

సింహా
WD
"నటసింహా" బాలకృష్ణ కథానాయకుడిగా, నమిత, నయనతార స్నేహాఉల్లాల్ కథానాయికలుగా నటించిన చిత్రం "సింహా". హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై యువనిర్మాత పరుచూరి కిరిటీ నిర్మించిన "సింహా" విడుదలైన అన్ని కేంద్రాల్లో రికార్డు కలెక్షన్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. 338 కేద్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అర్థ శతదినోత్సవం జరుపుకుని దిగ్విజయంగా శతదినోత్సవానికి చేరువవడం చాలా ఆనందంగా ఉంది.

బాలయ్యబాబు అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్, బోయపాటి శ్రీను ఎక్సెలెంట్ టేకింగ్, చక్రి సూపర్ మ్యూజిక్ "సింహా" చిత్ర విజయాన్ని చాలా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లాయి. 78 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో "సింహా"కు సంచలన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, బాలయ్యబాబుకు, అభిమానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.
About Writer
SELVI.M