1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Grandson

Savitri | Grandson | Abhinay | Young India | Dasari Narayana Rao | అలనాటి మహానటి ''సావిత్రి'' మనుమడా..!? మజాకా..!?

సావిత్రి
WD
సినీ ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించే నటీనటులు నిలదొక్కుకోవడం కష్టం. బ్యాక్‌గ్రౌండ్ ఉండికూడా నిలబడాలంటే చాలా కృషి చేయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. గతతరం నటీమణుల వారసులు సినీ రంగంలో అరుదు. అటువంటి అలనాటి నటి సావిత్రి మనుమడు అభినయ్ వడ్డి తనెవరో తెలీయకుండా దాసరి దర్శకత్వంలో "యంగ్ ఇండియా"కు ఎంపికై, నలుగురు హీరోల్లో ఒకరిగా పనిచేశాడు.

ఈ సందర్భంగా తన కెరీర్‌గురించి అభినయ్ చెపుతూ.. "దాసరి చాలా మంచివారు. ఆయన్ను దూరంగా చూస్తేనే చాలామంది భయపడతారు. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. మా అమ్మమ్మ సావిత్రి నటనను ఆయన మెచ్చుకునేవారు. క్లోజ్‌షాట్‌లో కెమెరా పెట్టి సినిమానే తీయవచ్చునని ప్రశసించారు. సావిత్రి వారసునిగా ఆమె పేరు నిలబెట్టాలని హితవు పలికారు.

తమిళంలో జెమినీగణేష్ ద్వారా కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లోనూ మా అమ్మ, అక్క రేఖ నుంచి ఆఫర్లు వచ్చాయి. బొంబాయి వచ్చేయ్ నేను చూసుకుంటానంది. కానీ అమ్మమ్మను ఆదరించిన టాలీవుడ్‌లోనే హీరోగా గుర్తింపు పొందాక ఇతర ఫీల్డులకు వెళతాను" అభినయ్ చెప్పారు.

విజయ చాముండేశ్వరి కుమారుడైన అభినయ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ తన టాలెంట్‌ను నమ్ముకున్నారు. మరి అలనాటి నటి సావిత్రి మనుమడా..? మజాకా..? ఎనీ వే ఆల్ ది బెస్ట్ అభినయ్.
About Writer
SELVI.M