1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ileana

NTR | Ileana | Sakthi | Kantri | Meher Ramesh | Aswani Datt | Sonu Sood | ఈజిప్ట్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!

ఎన్టీఆర్
WD
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా "కంత్రి" ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం "శక్తి" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత సి. అశ్వనీదత్ మాట్లాడుతూ.. "ఈ నెల 22 నుంచి 30వరకు ఈజిప్ట్‌లో విలన్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని జాకీష్రాఫ్, సోనూసూద్‌లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరుగుతుంది. జూలై 10 నుంచి ఎన్టీఆర్, ఇలియానాలతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, శ్రీనగర్, కాశ్మీర్, హరిద్వార్‌లలో ఆగస్టు 8వ తేదీ వరకు చిత్రీకరిస్తాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్‌, ఖర్చుతో కూడిన చిత్రంగా "శక్తి" నిర్మాణం జరుగుతోంది" అన్నారు.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె. భారవి, తోటప్రసాద్, డి.ఎస్. కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, డైరక్షన్ డిపార్ట్‌మెంట్: ఎల్.పి.రామారావు, రాజశేఖర్, మోహన్‌దీక్షిత్, రామకృష్ణారెడ్డి, చందు, జెన్నీఫర్, సమర్పణ: సి. ధర్మరాజు, నిర్మాత: సి. అశ్వనీదత్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మెహర్ రమేష్.
About Writer
SELVI.M