1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kota Prasad

Kota Srinivasa rao | Kota Prasad | Road accident | Gayam -2 | తెరపై డూప్‌ను పెట్టినా జీవితంలో ఆయనే చేశారు

కోట శ్రీనివాసరావు
WD
సినిమా కథల్లో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఆశ్చర్యమేస్తుంది. మంచివి జరిగితే ఆనందిస్తారు. అదే చెడు జరిగితే తట్టుకోలేరు. ప్రఖ్యాత నటుడు కోటశ్రీనివాసరావుకు నిజజీవితంలో అదే జరిగింది. నటునిగా ఆయన ఎన్నో శిఖరాలు అధిరోహించారు.

తన కుమారుడు కోట ప్రసాద్ విషయంలో ఆచితూచి అడుగులేయించారు. "సిద్ధం" చిత్రానికి ముందు ప్రసాద్ ఓ సినిమా చేసినా అందులో పెద్దగా పేరు రాలేదు. అయితే "సిద్ధం" తర్వాత కోటప్రసాద్ ఎవరో తెలిసింది. ప్రస్తుతం ఆయన వర్మ రూపొందిస్తున్న "గాయం -2"లో నటిస్తున్నారు.

విశేషమేమిటంటే... తండ్రీకొడుకులుగా ఆ చిత్రంలో చేయడం. కోట ప్రసాద్ చనిపోయిన దుఃఖాన్ని ఆపుకోలేక సాటి నటుడు రాళ్లపల్లి ఈవిధంగా వ్యాఖ్యానించారు. "గాయం -2లో కోటప్రసాద్ చనిపోయే సన్నివేశం ఉంటుంది. చితికి కోట శ్రీనివాసరావు నిప్పు పెట్టాలి. ఈ దృశ్యాన్ని కోట శ్రీనివాసరావు తాను చేయలేనని తేల్చి చెప్పాడు. నటునిగా ఎన్నో దశల్ని చూశాను. ఎన్నో చావుల సన్నివేశాల్లో పాల్గొన్నాను.

నా కుమారుడు పాడెపై ఉంటే చూడలేను. దయచేసి డూప్ పెట్టించండి అని వేడుకున్నారు. ఆయన కోరికపై సన్నివేశాన్ని అలానే డూప్‌తో చేశారు. కానీ నిజజీవితంలో అది జరుగుతుందని ఊహించలేదు" అంటూ రాళ్లపల్లి కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

అందుకే చాలామంది హీరోలు ఇలాంటి సన్నివేశాలు వస్తే కథనే మార్చేస్తారు. ఏదేమైనా విధి ఆడించే సినిమాలో అంతా పాత్రధారులే.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి