1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Vikram

Vilon | Vikram | Aishwarya Rai | Lip movement | లిప్ మూవ్‌మెంట్ కలవని "విలన్" బోరెత్తుతోంది

విలన్
WD
ఏక కాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన రావణ్ తెలుగులో "విలన్‌"గా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన జనం డబ్బింగ్ విషయంపై పెదవి విరుస్తున్నారు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో తెలుగు మాటలకు సరిపడ్డట్లు విక్రమ్ - ఐశ్వర్యారాయ్‌ల పెదవులు కదలకపోవడంతో సీన్లు కాస్తా చిర్రెత్తిస్తున్నాయంటున్నారు.

మరీ ముఖ్యంగా క్లోజ్ షాట్లలో ఈ లిప్ మూవ్‌మెంట్ కదలికలు సంభాషణకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురవుతున్నట్లు చెపుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు డబ్బు పోసి చిత్రీకరించిన సినిమాను ఇలా చేశారేమిటా అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి.

ఏం చేద్దాం... హీరో తమిళ నటుడు. హీరోయిన్ బాలీవుడ్ నటి. ఎడ్జెస్ట్ అయిపోవడమే. లిప్ మూవ్‌మెంట్లను చూపినప్పుడు స్పందించకుండా... యాక్షన్ సన్నివేశాలకు మాత్రం స్పందిస్తే సరి అని సర్ది చెపుతారేమో సినీ దర్శకనిర్మాతలు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి