Lawrence | Cinema | జూలై ప్రథమార్థంలో వస్తోన్న "లారెన్స్"
నృత్య దర్శకుడు లారెన్స్ హీరోగా తమిళంలో సూపర్‌గుడ్ సంస్థ నిర్మించిన ఓ విజయవంతమైన చిత్రాన్ని కేవీఆర్ ఫిలిమ్ ప్రొడక్షన్ పతాకంపైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ వరహాలరావు తెలుగులోకి "లారెన్స్" చిత్రాన్ని అనువదిస్తున్నారు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ మధ్యనే తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను ముగించి చిత్రాన్ని జూలై ప్రథమార్థంలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
లారెన్స్ సరసన స్నేహిత నటించిన ఈ చిత్రంలో పిరమిడ్ నటరాజన్ ఓ ముఖ్య పాత్రను పోషించారు. రచన: ఘంటసాల రత్నకుమార్, సంగీతం: శివకుమార్, నిర్మాత: కోరుకొండ వరహాలరావు, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అర్పుతం