1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mohan Babu

Manchu Manoj | Mohan Babu | Tapsi | గాళ్ ఫ్రెండ్స్‌తో తిరిగొస్తున్నాడు.. అందుకే లేట్..!!

మంచు మనోజ్
WD
సినీ హీరో అన్నాక ఎంజాయ్‌మెంట్‌కు చాలా అవకాశాలుంటాయి. తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుచ్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయకులు తండ్రి అడుగుజాడల్లోనే నడవాలంటారు. తండ్రికి మంచి పేరు తేవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు.

అక్కినేని నుంచి ఎన్టీఆర్ కుటుంబాల హీరోలు కథానాయకులుగా అలా పేరు తెచ్చుకున్నవారే. చిరు, ఇవివి సత్యనారాయణ ఫ్యామిలీల నుంచి వచ్చిన యువ హీరోలు కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్‌తో పాటు పర్సనల్ కెరీర్ కూడా ముఖ్యమే. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే.. వారిని బయట నుంచి వేయికళ్లు గమనిస్తుంటాయి.

బయటివాళ్ల సంగతి ఎలా ఉన్నా... ఇంట్లో పేరేంట్స్ మరింత నిశితంగా గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా ఆయన కుమారుడు మనోజ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. క్రమశిక్షణతో పైకి వచ్చిన మోహన్ బాబు తన కొడుకుల్ని కూడా అలానే పెంచారు. క్రమశిక్షణ తప్పితే తనవారైనా పరాయివారైనా ఒక్కటే. మోహన్ బాబు తన రెండవ కుమారుడు మంచు మనోజ్ విషయంలో తన మనసు విప్పారు.

బుధవారం ప్రెస్ మీట్‌కు ఆలస్యంగా వచ్చిన మనోజ్‌నుద్దేశించి అడిగితే... వెంటనే మోహన్ బాబు కలుగజేసుకుని.. వాడు నా దగ్గరుంటే టైమ్‌కు వచ్చేవాడు. ఇప్పుడు హీరోగా హిట్లు కొడుతున్నాడు కదా.. అందుకే నాన్న దగ్గర ఎందుకని బైట ఉంటున్నాడు. గాళ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే ఆలస్యమైందని సెటైర్ విసిరారు.

దీంతో మింగలేక.. కక్కలేక మంచు మనోజ్ తల వంచుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉండాల్సి వచ్చింది. తండ్రి మాటలపై స్పందించమంటే.. నో కామెంట్ అన్నాడు మనోజ్. తాజా చిత్రంలో ఢిల్లీకి చెందిన భామ తాప్సీ బొడ్డు, అధరాలపై ద్రాక్ష పండ్లను తాకిస్తూ బాగానే ఎంజాయ్ చేశాడని యూనిట్ చెప్పుకుంటోంది.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి