Simha | 50 days | Balakrishna | Dasari | Paruchuri Kireeti | సింహా.. ఆహా.. ఓహా.. శభాష్.. 50 రోజులు..!!
WD
ముందుగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... నందమూరి వంశానికి, పరుచూరి వంశానికి అవినావభావ సంబంధముంది. ఈ సినిమా తీసింది పరుచూరి కిరీటి. చాలామంది మీ అబ్బాయి మంచి సినిమా తీశాడు అని అంటున్నారు. నాకు అబ్బాయిలు లేరు. అయినా కిరీటి మా అబ్బాయే. అలాగే వేణు మాధవ్‌ను మా అబ్బాయి అని బాగా చేస్తున్నాడని గతంలో అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మనసు పులకించిపోతుంది. ఒక్కో సినిమా హిట్టయితే అది ఒక్కరికే చెందుతుంది. కానీ బాలయ్య సింహా హిట్ అయితే ఇండస్ట్రీ అంతా ఆనందించింది అన్నారు.
దాసరి మాట్లాడుతూ... నా మనస్సులోని మాటను పరుచూరి గోపాలకృష్ణ చెప్పాడు. బాలయ్య హిట్ కొట్టాలని ఇండస్ట్రీ చూసింది. ఆయన మంచితనం ఒకటయితే... పెద్ద హిట్ కొడితేనే ఇండస్ట్రీ నిలుస్తుంది అనేది రెండోది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా ఉండి ఎన్నాళ్లయిందో.. మరిన్ని విజయాలు ఇండస్ట్రీకి రావాలని అన్నారు. నాలుగు డ్యూయెట్లు, ఫైట్లు ఉంటే సినిమా కాదు. ఆర్టిస్టుగా చెప్పుకోవాలంటే ఇటువంటి సినిమాలు చేయాలని సూచించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... శతదినోత్సవం వైపు పరుగులు తీస్తున్న ఈ చిత్ర విజయం ప్రేక్షకులదేనని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రెండవ హీరో చక్రి. విడుదలకు ముందే సంగీతం విజయ సంకేతాన్నిచ్చింది. ఈ కథ మీసంలోంచే పుట్టింది. దర్శకుడు అద్భుతంగా తీశాడు. దర్శకరత్నలాగా ఆయనకూ భవిష్యత్‌లో బిరుదు వస్తుందని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి డాక్టర్ దాసరి, బాలకృష్ణ షీల్డులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి వంశీయులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.