1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Adarsa

Manmatha Kamarajulu | Adarsa | Monotakkar | జులై రెండో వారంలో "మన్మథ కామరాజులు"

మన్మథ కామరాజులు
యస్‌సిసి క్రియేషన్స్ పతాకంపై రవి.కె పట్వా - సంజయ్ దర్శకత్వంలో వై.పి.శెట్టి నిర్మాతగా హిందీలో విజయవంతమైన వాత్సాయన కామసూత్ర ఆధారంగా తెలుగులో రూపొందిస్తున్న మన్మథ కామరాజులు చిత్రం ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, జులై రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. 

ఈ సందర్భంగా నిర్మాత వై.పి.శెట్టి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... కామసూత్రాలు అంటే ఏమిటి..? అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వాత్సాయన కామసూత్రాలు భారతదేశం శృంగార కథలలో ఎంతో వైవిధ్యమైనవిగా చెప్పుకుంటారు.

అప్పటి రాజుల కాలంలో జరిగిన వాత్సాయన కామసూత్రాలు నేటి ట్రెండ్‌కు అనుగుణంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ చిత్రంలో చూపించబోతున్నాం. అంతఃపురంలో ఉండే అందమైన మన్మథుల కార్యకలాపాలను, వారి విలాసాలను, రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఆదర్శ, మోనోటక్కర్, సురేష్ బేడీ, హసీనా హీరోహీరోయిన్లుగా నటించారని అన్నారు.
About Writer
Venkateswara Rao. I