Mahesh Babu | Trivikram Srinivas | Anushka | Samanta | ఫ్యాన్స్‌కు దూరంగా లేను: మహేష్ బాబు
WD
యాడ్‌ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాననే విషయాన్ని కొట్టి పారేశారు. ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగాను ఉన్నానన్నారు. నాన్నగారి హయాంలో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరగా ఉండేవారనే విషయం కరక్టే అనీ, ఇప్పుడు జనరేషన్‌కు, అప్పటికి చాలా తేడా ఉందన్నారు.
ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉన్నాననీ, యాడ్స్ వల్ల ఒక్కోసారి ఫ్యాన్స్ కుటుంబాలను కూడా కలుస్తున్నానన్నారు. త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ... టాకీ పూర్తయింది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉంది. అవి కాగానే ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.
అయితే సోమవారం ఉదయం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రం లాంఛనంగా ప్రారంభమైందనీ, రెగ్యులర్ షూటింగ్ జూలై 20 నుంచి జరుగుతుందని మహేష్ బాబు అన్నారు. రామానాయుడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగిన ఈ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరు కాలేదు.
సమంతా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నమో వెంకటేశ నిర్మాతలు ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు డాక్టర్ డి. రామానాయుడు క్లాప్ కొట్టగా, అరుంధతి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కెమేరా స్విచాన్ చేశారు.